GDWL: హైరిస్క్ గర్భిణీలు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవాలని హెల్త్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ సూచించారు. గద్వాల మండలం సంగాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో గర్భిణీలకు పరీక్షలు చేశారు. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే పీహెచ్‌సీని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
'హైరిస్క్ గర్భిణీలు పరీక్షలు చేయించుకోవాలి'


