HNK: కమలాపూర్ మండలంలోని గూడూరు క్రాస్‌రోడ్డు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వంగపల్లి నుంచి హనుమకొండకు ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై అనంతగిరి మధు తెలిపారు. ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
VIDEO: ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం..!


