హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: రాష్ట్రం పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేటపాలెం మండలం రావూరిపేట శ్రీ కనక నాగారప్పమ్మ దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, ఆయన ధర్మపత్ని బాలకొండమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాలని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి కొరత తీరాలని కోరారు.