హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

BDK: భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో కల్యాణోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని దర్శించి తరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందుకున్నారు.