హైదరాబాద్: 28°C
తెలంగాణ

లయన్స్ క్లబ్ భవనంలో కంటి వైద్య శిబిరం

NZB: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్య రాజు 31 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరిని శస్త్ర చికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.