హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతుల స్వైర విహారం..!

WGL: నగరంలోని కాశిబుగ్గలో గల పలు కాలనీలలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో వానరాలు గుంపులు గుంపులుగా కాలనీలలో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బయటికి రావాలంటే మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులు జంకుతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని కోతుల బెడద తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.