హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి'

WNP: దొరబాయిమిట్ట వద్ద ఆర్టీసీ డీలక్స్ బస్సు–ఆటో ఢీకొన్న ప్రమాదంలో కొండ వనజ మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.