హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలి'

BHPL: ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 85 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు ఎండార్స్ చేశామన్నారు. పరిష్కారంలో జాప్యం చేయవద్దని, చర్యలను పోర్టల్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.