హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుణ యాగంలో పూతలపట్టు ఎమ్మెల్యే

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ సన్నిధిలో వర్షాల కోసం మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని యాగంతో పాటు వరుణ జపం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమాలు, పూజలలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఈవో పెంచల కిషోర్ ఉన్నారు.