హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు రాజముద్ర పాస్‌పుస్తకాల పంపిణీ

BPT: వేమూరు మండలం చావలి స్వర్ణ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చావలి, అబ్బనగుడవల్లి, చదలవాడ గ్రామాలకు చెందిన 2,691 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పంపిణీ చేశారు. రీ-సర్వే ద్వారా భూ హక్కులకు పూర్తి భద్రత, పారదర్శకత చేకూరుతుందని ఆయన తెలిపారు.