హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూకాలమ్మ ఆలయంలో వరుణయాగం

VSP: ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు కురవక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. కాగా, అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో ఇవాళ వరుణయాగం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వరుణ జపం, సహస్ర ఘట్టాభిషేకం జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఛైర్మన్ పీలా నాగ శ్రీను, భక్తులు పాల్గొన్నారు.