W.G: తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వరుణ జపం, వరుణ యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఆలయ ఛైర్మన్ పత్తి రామకృష్ణ దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో ఎం.వి.రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దానేశ్వరి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం


