హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం కోసం రైతుల వరుణయాగం

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం రైతులు గ్రామ ప్రజలు కలిసి వర్షం కోసం వరుణ యాగం పూజను నిర్వహించారు. గ్రామ ప్రజలు ఒక్కొక్కరు ఒక బిందెతో నీటిని తీసుకొని వచ్చి చౌడేశ్వరి దేవి అమ్మవారికి జలాభిషేకం చేశారు. వర్షాల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు.