హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతతో పొంచి ఉన్న ప్రమాదం..!

MLG: ములుగు సమీపంలోని దేవగిరిపట్నం వెళ్లే రహదారిపై ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. గుంతను తప్పించుకునే క్రమంలో ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పలువురు గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రివేళ ప్రమాదం మరింత పొంచి ఉండటంతో అధికారులు వెంటనే గుంతను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.