KDP: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తాగునీటితో పాటు ఆర్‌టీపీపీ, పరిశ్రమలు, 70 వేల ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన మైలవరం జలాశయానికి లస్కర్ల కొరత వేధిస్తోంది. 100 మందికి పైగా అవసరం ఉండగా కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో గేట్లు, కాలువల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అవుట్‌సోర్సింగ్ ద్వారా లస్కర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మైలవరం జలాశయానికి సిబ్బంది కొరత


