హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న MLA

SKLM: జలుమూరు (M) శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక వరుణ యాగం నిర్వహించారు. నరసన్నపేట MLA రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, భూగర్భ జలాలు వృద్ధి చెందాలని, ప్రజలకు సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.