హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి వెంకన్న ఆలయానికి రూ.1,00,116 విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి రాజమండ్రి వాస్తవ్యులు శ్రీమతి లక్ష్మీ, శ్రీ పెద్దింటి రంగాచార్యులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. ఆలయ నిత్య అన్నప్రసాద కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన దాతలను ఆలయ అధికారులు అభినందించారు.