సత్యసాయి: శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో 476.2 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 32 మండలాలకుగాను 30 మండలాల్లో వర్షం కురిసిందని అధికారులు మంగళవారం తెలిపారు. నంబులపూలకుంట మండలంలో అత్యధికంగా 54.2 మిమీ, బత్తలపల్లెలో 44.2 మిమీ మేర వర్షం పడింది. రోళ్ల, అగళి మండలాల్లో మాత్రం వర్షం నమోదు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 476.2 మిమీ వర్షపాతం నమోదు


