హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐలు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా తణుకు వాసి

W.G: తణుకుకు చెందిన న్యాయవాది కామన మునిస్వామి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 3, 4 తేదీల్లో నెల్లూరులో జరిగిన ఐలు రాష్ట్ర మహాసభలో ఉభయ గోదావరి ప్రతినిధులు ఆయనను ఎన్నుకున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం, నగదు రహిత వైద్య బీమా, జూనియర్ల భృతి రూ.10 వేలకు పెంపు కోరుతూ సభ తీర్మానించింది.