హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాకు 3,008 ఇళ్లు'

PPM: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్, అవాస్ ప్లస్ 2.0 పథకాల కింద మన్యం జిల్లాకు 3,008 ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలోని 15 మండలాలకు ఇళ్లను కేటాయించారు. అత్యధికంగా గుమ్మలక్ష్మీపురానికి 688, కురుపాంకు 332, సీతంపేటకు 288, కొమరాడకు 252 ఇళ్లు కేటాయించారు. ఇప్పటికే నిర్వహించిన అవాస్ ప్లస్–2024 సర్వే ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు.