ప్రకాశం: మార్కాపురం డివిజన్ పరిధిలో పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ సత్య నారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం డివిజన్లో పోలీస్ 30 యాక్ట్


