BHPL: మల్హర్‌రావు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన జనగామ సాయి లోహిత్ క్రీడారంగంలో ప్రతిభ చాటుతూ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం మణికొండ వరల్డ్ స్కూల్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయి లోహిత్, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
తెలంగాణ
వాలీబాల్‌లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయి ఎంపిక


