హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

GNTR: ఉండవల్లిలోని CM క్యాంప్ ఆఫీస్‌లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై వీరిద్దరు ప్రధానంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఈ సమావేశంలో ప్రాథమిక కసరత్తు జరిపారు. ఎన్నికల్లో కలిసికట్టుగా దూసుకెళ్లేలా నేతలకు దిశానిర్దేశం చేశారు.