హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రసామంతవలసలో ఏనుగుల గుంపు

మక్కువ మండలం ఎర్రసామంతవలస సమీపంలో ఏనుగుల గుంపు కదలికలను గుర్తించినట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారులు ఇవాళ ఉదయం తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లే రైతులు, కట్టెల కోసం అడవికి వెళ్లేవారు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటిస్తూ గమ్య స్థానాలు చేరాలని హెచ్చరించారు.