హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఘనంగా వరుణ జపం

కాకినాడ: అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వరుణ జపములు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈఓ చక్రధర్ రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వరుణ జపములను నిర్వహించారు.