హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్నంవారిపాలెంలో పారిశుద్ధ్య లోపం

బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెంలో రోడ్డు వెంట చెత్త విఫరీతంగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పలు పెరిగిపోవడంతో ప్రాంతం మినీ డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. కుక్కలు చెత్తను రహదారులపైకి ఈడ్చుకురావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.