హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో వరుణ జపం

GNTR: తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం పుష్కరిణిలో మంగళవారం ఉదయం వరుణ జపం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అనావృష్టి నివారణ, దేశం, రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని, లోకకళ్యాణం కోసం వేద పండితులతో వరుణ జపం, వరుణ హోమం, పూర్ణాహుతి, పంచామృత అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు.