హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో భీమేశ్వర ఆలయంలో వరుణయాగం

ELR: ఉంగుటూరు వద్ద భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం చేయడానికి మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మహిళలతో కలిసి కాలువలో బిందెతో నీరు పట్టుకుని వరుణయాగానికి ఊరేగింపుగా బయలుదేరారు. గోదావరి బిందువు నీటిని తీసుకుని శివాలయానికి చేరుకుని వేద మంత్రాల ఉచ్చారణ మధ్య వరుణయాగం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సస్యశ్యామలంగా ఉండాలన్నారు.