హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ సర్క్యూట్‌తో బేకరీ దగ్ధం.. రూ.20 లక్షల నష్టం

CTR: కుప్పం-గుడిపల్లి మార్గంలోని మ్యాక్స్ బేకరీలో సోమవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో బేకరీ వెనుక భాగంలోని తినుబండారాలు తయారీ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బేకరీ యజమాని తెలిపారు.