హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్లవర్‌ మార్కెట్‌ శుభ్రతపై కమిషనర్‌ సంతృప్తి

KRNL: కొండారెడ్డి బురుజు ఫ్లవర్‌ మార్కెట్‌లో పరిశుభ్రతపై నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ మార్కెట్‌ను తనిఖీ చేసిన ఆయన శుభ్రత పాటిస్తున్న వ్యాపారులను అభినందించారు. మార్కెట్‌ పరిసరాల్లో చెత్త లేకుండా ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వెంకటరమణ కాలనీ, చెత్త బదిలీ కేంద్రం, అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.