సత్యసాయి: పెనుకొండ మండలం శెట్టిపల్లి రైల్వే గేట్ సమీపంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెనుకొండ మండలంలో విషాద ఘటన


