హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావొద్దు: SI

తూ.గో: సీతానగరం, దేవీపట్నం మండలాల పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని SI ఎల్. శ్రీనివాస్ నాయక్ తెలిపారు. దీంతో పోలీస్, రెవెన్యూ శాఖలు ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశాయి. రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, అత్యవసరమైతే టార్చ్‌లైట్లతో గుంపులుగా వెళ్లాలని చెప్పారు. పులి కనిపిస్తే అధికారులకు తెలపాలని కోరారు.