హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్వీస్‌ రోడ్డులోకి దూసుకెళ్లిన లారీ..!

JN: స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణంలో మంగళవారం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇసుక లారీ టైర్‌ పగిలి అదుపుతప్పింది. లైటింగ్‌ పోల్‌ను ఢీకొట్టి సర్వీస్‌ రోడ్డులోకి దూసుకెళ్లింది. సర్వీస్‌ రోడ్డులో వాహనాలు, జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు లారీని తొలగించే చర్యలు చేపట్టారు.