హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామంలో దొంగల బీభత్సం...బాధితుల ఆందోలన'

​SRD: న్యాల్కల్ మండలం కల్బేమల్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన రెండు ఇళ్లలో చొరబడిన దుండగులు రూ. లక్షన్నరకు పైగా నగదుతో పాటు బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గమనించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హద్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో పరిశీలించి సమగ్ర విచారణ చేపడుతున్నారు