హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛాయాసోమేశ్వరాలయ కోనేరుకు పునరుజ్జీవం

NLG: నల్గొండ నగర పరిధిలోని పానగల్లులోని ప్రసిద్ధ శ్రీ ఛాయాసోమేశ్వరాలయ కోనేరుకు పూర్వ వైభవం రానుంది. నూతన ఆలయ కమిటీ కోనేరుకు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టింది. ఎక్స్కవేటర్‌తో పూడికను తొలగించి, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. పూడికతీత పనులు పూర్తయిన అనంతరం కోనేరుకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు కమిటీ ప్రణాళిక రూపొందించింది.