SRCL: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రమేష్ తెలిపారు. పదిర గ్రామ శివారులోని మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన డ్రైవర్ రామచంద్రం, యజమాని వట్టెల రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ సీజ్


