హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన మండలం చేవేండ్రపాలెం గ్రామంలో రూ.33 లక్షలతో నిర్మించిన నూతన తారు రోడ్డును ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.