హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగునీటితో రహదారులు జలమయం

MDCL: హబ్సిగూడ వెంకట్‌రెడ్డినగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో కొన్నిరోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి, కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కారణంగా దుర్వాసనతో పాటు దోమలు పెరిగి స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.