హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ‘మహిళా లాంజ్’ ఏర్పాటు..!

ఖమ్మం: నగర పాలక సంస్థ కార్యాలయంలో పనిచేసే మహిళా సిబ్బంది సౌకర్యార్థం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక మహిళా లాంజ్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. విధుల్లో ఉండే ఉద్యోగినులు విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి మరియు పిల్లల సంరక్షణ కోసం ఈ గదిని తీర్చిదిద్దారు.ఆఫీసులో మహిళలకు అనుకూలమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఈ చర్యను చేపట్టింది.