హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిరోడ్డుపై చిరుత సంచారం

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చిరుతపులి ప్రత్యక్షమైంది. రోడ్డుపై స్వేచ్ఛగా సంచరిస్తున్న చిరుతను చూసి గాజులపేటకు వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీయగా, మరికొందరు తమ చరవాణుల్లో చిరుత సంచారాన్ని చిత్రీకరించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.