హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బోధన్ పట్టణంలో విద్యుత్ అంతరాయం

NZB: బోధన్ పట్టణంలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. ఆజం గంజ్ 11కేవీ ఫిడర్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల కటింగ్ పనుల కారణంగా సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఆజం గంజ్ ఏరియా, సాయిబాబా ఆలయ ఏరియా, గోశాల రోడ్డులోని కాలనీల వినియోగదారులు సహకరించాలని కోరారు.