హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ

KMR: జుక్కల్ మండలం రుద్రపహాడ్ శివారులోని దర్గా వద్ద మిషన్ భగీరథ పైప్లాన్ లీకేజీ కావడంతో పరిసర ప్రాంతం జలమయమైంది. నెలకోసారైనా పైప్‌లైన్ లీకేజీ అవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారు గుర్తించి అధికారులకు ఫోన్ చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.