KDP: సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామ సమీపంలోని నిత్యపూజ్యయ్య కోనకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. దీంతో కోనకు వచ్చే భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి భక్తుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి దెబ్బతిని భక్తులకు ఇబ్బందులు


