హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పులివెందులలో భారీ కొండచిలువ ప్రత్యక్షం

KDP: పులివెందుల పట్టణంలోని రాయలాపురం సమీపంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ కనిపించింది. రోడ్డు దాటుతున్న కొండచిలువను వాహనదారులు గుర్తించారు. అనంతరం అది సమీపంలోని చెట్టుపైకి చేరుకుంది. భారీ కొండచిలువను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది.