హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఖాళీ పోస్టుల భర్తీ

KRNL: ఆదోనిలోని వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ICDS పీడీ విజయ తెలిపారు. నేటి నుంచి 12వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కర్నూలు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని తెలిపారు