హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మాలాసనం.. ఆరోగ్య రహస్యాలు

మాలాసనం వేసినప్పుడు పొట్ట భాగంలో, అంతర్గత అవయవాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఉండదు. గ్యాస్, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము, తొడలు, పిక్కలు, మడమలు బలంగా తయారవుతాయి. కాళ్లు, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేసే వారికి వెన్నెముక కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. మాలాసనం వెన్నెముకను నిటారుగా ఉంచి, వెన్నుపూసలను సాగదీస్తుంది.