హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నీళ్లు తక్కువగా తాగుతున్నారా?

నీరు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి గుండె వేగంగా కొట్టుకునే అవకాశం ఉందని కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ తెలిపారు. శరీరంలో ద్రవాలు తగ్గితే రక్త పరిమాణం తగ్గి, అవయవాలకు ఆక్సిజన్ అందించేందుకు గుండె మరింత వేగంగా పనిచేస్తుంది. దాహం, నోరు పొడిబారడం, ముదురు మూత్రం, తలనొప్పి, అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. తగినంత నీరు తీసుకోవడం అవసరం.