హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదివాసీల ఆందోళన కొనసాగింపు..!

BDK: కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా రాత్రి వరకు కొనసాగింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నాయకులు తెలిపారు. పోలీసులతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో నిరసన కొనసాగుతోంది. భారీగా ఆదివాసీలు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.