NTR: జగ్గయ్యపేటలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన హైవే బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ప్రాంగణం పిచ్చి మొక్కలతో నిండి, ఫ్యాన్లు, లైట్లు దొంగల పాలయ్యాయి. రాత్రివేళల్లో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. బస్సులు లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు హైవేపైనే వేచిచూస్తున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపయోగంగా జగ్గయ్యపేట హైవే బస్టాండ్


