హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయండి'

GDWL: అలంపూర్ పట్టణంలోని బస్టాండ్‌లో సమయానుకూలంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ ఆలయాలకు వివిధ ప్రాంతాల నుండి అనేకమంది భక్తులు నిరంతరం వస్తుంటారు. పాలకులు స్పందించి ప్రజల సౌకర్యార్థం సమయానుకూలంగా ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.